pak: ఇక ఊరుకోం.. ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ: పాక్ కు గట్టిగా హెచ్చరికలు జారీ చేసిన భారత ఆర్మీ

  • పదే పదే కాల్పులకు తెగబడుతున్న పాక్ 
  • పాకిస్థాన్ డీజీఎంఓకు భారత డీజీఎంవో ఫోన్ 
  • పాక్ సైన్యం మ‌రోసారి కాల్పులు జ‌రిపితే ప్రతీకారం తీర్చుకుంటాం
  • తీవ్ర‌ పరిణామాలు ఉంటాయి

సరిహద్దుల్లో పదే పదే కాల్పులకు తెగబడుతూ రెచ్చగొడుతున్న పాకిస్థాన్‌కు భార‌త ఆర్మీ గ‌ట్టిగా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్‌ (డీజీఎంవో) లెఫ్టినెంట్‌ జనరల్‌ ఏకే భట్.. పాకిస్థాన్ డీజీఎంఓకు ఫోన్ చేసి పాక్ సైన్యం మ‌రోసారి కాల్పులు జ‌రిపితే ప్రతీకారం తీర్చుకుంటామ‌ని తేల్చి చెప్పారు. అలాగే, సరిహద్దుల నుంచి ఉగ్ర‌వాదులు భార‌త్‌లోకి ప్ర‌వేశించ‌డాన్ని పాక్ సైన్యం ప్రోత్స‌హిస్తోంద‌ని చెప్పారు.

ఇక‌పై ఇటువంటి చర్య‌ల‌కు పాల్ప‌డితే తీవ్ర‌ పరిణామాలు ఉంటాయని తెలిపారు. సరిహద్దుల్లో ఉద్రిక్త‌త‌లు చెల‌రేగ‌కుండా ఉండేందుకు కృషి చేయాలని చెప్పారు. పాక్ సీమాంతర తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుండ‌డంతో జమ్మూ కశ్మీర్‌లో భద్రతాపరమైన సమస్యలు వస్తున్నాయని తెలిపారు. భార‌త ఆర్మీలో స‌మ‌ర్థ‌వంత‌మైన సైనికులు ఉన్నారని, వారు పాక్ చేష్ట‌ల‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురు చూస్తున్నార‌ని చెప్పారు. భార‌త్ దీటుగా స‌మాధానం ఇస్తుంద‌న‌డంతో ఇక‌ అనుమానాలు ఏవీలేవ‌ని ఆయన అన్నారు. ఈ విష‌యాల‌ని ఆర్మీ వర్గాలు మీడియాకు తెలిపాయి. 

pak

More Telugu News