mersal: యూట్యూబ్ లో ప్రపంచ రికార్డును బద్దలుకొట్టిన విజయ్‌ ‘మెర్సల్‌’ సినిమా టీజర్‌

  • అజిత్‌ ‘వివేగం’ టీజ‌ర్ రికార్డు బ‌ద్ద‌లు  
  • ‘మెర్సల్‌’ సినిమా టీజర్‌ కి ఏకంగా 6,95,000 లైక్స్‌ 
  • 24 గంటల్లో 9 మిలియన్‌ వ్యూస్‌ కూడా

తమిళ హీరో విజయ్‌ నటించిన ‘మెర్సల్‌’ సినిమా టీజర్‌ యూట్యూబ్ దుమ్ముదులిపేసింది. హాలీవుడ్ సినిమా ‘స్టార్‌వార్‌-ది లాస్ట్‌ ఆఫ్‌ జేడీ’ టీజర్‌ లైక్స్‌ రికార్డును అజిత్‌ ‘వివేగం’ టీజ‌ర్ బ‌ద్ద‌లు కొట్ట‌గా ఇప్పుడు 6,95,000 లైక్స్‌తో ‘మెర్సల్‌’ సినిమా టీజర్ ‘వివేగం’ రికార్డును కూడా తిర‌గ‌రాసింది. దర్శకుడు అట్లీ పుట్టినరోజు సందర్భంగా నిన్న ‘మెర్స‌ల్‌’ టీజర్ రిలీజ్ అయింది. ఇందులో విజ‌య్ మూడు పాత్ర‌ల్లో క‌న‌ప‌డ‌నున్నాడు. ఆయ‌న స‌ర‌స‌న‌ కాజల్‌, నిత్యా మేనన్‌, సమంత నటిస్తున్నారు.

ఈ సినిమా వ‌చ్చేనెల‌ 18న విడుద‌ల కానుంది. ‘మెర్సల్‌’ సినిమా టీజర్‌ 24 గంటల్లో 9 మిలియన్‌ వ్యూస్‌ను కూడా సాధించి మరో రికార్డును కూడా నెల‌కొల్పింది. మెర్స‌ల్ సినిమాను తెలుగులో ‘అదిరింది’ పేరుతో విడుద‌ల చేయ‌నున్నారు.  

More Telugu News