ap7am logo

ప్రెస్ నోట్: అట్లాంటా వాసులకు ఆత్మీయ రుచులను అందించనున్న గోదావరి

Fri, Sep 22, 2017, 07:00 PM
ప్రెస్ నోట్: పల్లెటూరు ఆత్మీయ వాతావరణంలో నోరూరించే రుచులు అట్లాంట వాసుల కోసం సిద్ధమైన గోదావరి.
 
ప్రపంచంలో అతి వేగంగా ఎదుగుతున్న దక్షిణాది ఆహార ఉత్పత్తుల రెస్టారెంట్ చైన్ అయిన గోదావరి తన మైమరపించే రుచులను గ్రేటర్ అట్లాంటా ప్రాంతంలోని భోజన ప్రియుల జీహ్వ చాపల్యాన్ని తీర్చేందుకు సిద్ధమయింది.
 
ఆల్ఫరెట్టాలో ప్రారంభం కానున్న గోదావరి తెలుగు మరియు తమిళ సంప్రదాయాల మేళవింపుతో ప్రతిధ్వనించనుంది. విశిష్టమైన పల్లెటూరు వాతారణంతో ప్రవాస భారతీయులు, భారతీయ రుచులు అద్భుతమైన రుచులను ఆస్వాదించేలా తీర్చిదిద్దారు.
 
వేగంగా దూసుకుపోతున్న భారతీయ ప్రజానీకానికి చేరువ అయ్యేలా కీలక స్థానంలో గోదావరి అట్లాంటా కొలువుదీరింది (Godavari Atlanta). ఏటీ&టీ సహా అనేక కార్పొరేట్‌ దిగ్గజ సంస్థల కీలక కేంద్రాలు, కార్పొరేట్‌ కేంద్రాలు విస్తరించి ఉన్నప్రాంతంలో గోదావరి అట్లాంటా ప్రారంభం కానుంది.
 
“అట్లాంటాలో గోదావరి ఏర్పాటుకు సంబంధించి కలిసి ముందుకు సాగేందుకు వేలాది ప్రతిపాదనలు మాకు వచ్చాయి. వేగంగా ఎదుగుతున్న బ్రాండ్‌ గోదావరి సత్తాను ఈ ఆదరణ చాటిచెప్తోంది”.
 
“ఇన్నాళ్లుగా మాకోసమే వేచి ఉందా అనే రీతిలో ప్రస్తుతం మేం ఎంచుకున్న స్థలం ‘గోదావరి’కి ప్రత్యేకతను సంతరించింది. ప్రతివింద్‌తో మేం అనుసంధానం అవడం అత్యుత్తమ నిర్ణయంగా భావిస్తున్నాం. ఆయన యువకుడైన, ఉత్సాహవంతమైన యువవ్యాపారవేత్త. అట్లాంటా అంతటా మా ప్రామాణికమైన రుచులను ఆస్వాదిస్తారని, ఈ కేంద్రం మరింత విస్తృతికి ఉపయోగపడుతుంది” అని గోదావరి కార్పొరేట్‌ తరఫున వరుణ్‌ మేడిశెట్టి విశ్వాసం వ్యక్తం చేశారు.
 
ఇక గోదావరికే ప్రత్యేకమైన, అందరి నోరూరించే వంటకాల ‘ధమాకా’ లంచ్‌ బఫెట్‌తో (Lunch Buffet) అట్లాంటాలోని భోజన ప్రియులను సైతం అలరించేందుకు గోదావరి సిద్ధమైంది. ‘పనసాకు ఇడ్లీ’, ‘కేసీఆర్‌ కోడి రోస్ట్‌’, ‘హంసానందినిహల్వా’, ‘కత్తిమహేశ్‌ కంజు వేపుడు’, ‘పైనాపిల్‌ రసం’ ‘కుండమీది పెరుగు’తో పాటుగా అనేక దక్షిణాది వంటకాల రుచులను తన అతిథులకు గోదావరి అట్లాంటా అందించనుంది.
 
“అత్యుత్తమ క్వాలిటీ, అద్భుతమైన రుచుల వల్ల అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో గోదావరి బ్రాండ్‌కు దక్కుతున్న విశేషమైన ఆదరణతో బ్రాండ్ గోదావరి వేగంగా ఎదుగుతోంది. గోదావరి టీం మేనేజ్‌మెంట్‌ వ్యవహారశైలి, వారు మద్దతు ఇస్తున్నతీరు, సేవలు అందించే క్రమంలో ప్రత్యేకత వంటివి అందరినీ ఆకట్టుకుంటాయి. అందుకే గోదావరితో అనుబంధం విషయంలో రెండో ఆలోచనే లేకుండా వెంటనే ముందడుగు వేశాను. గోదావరిలోని ప్రతి సభ్యుడు డైనమిక్‌, ఎనర్జిటిక్‌గా పనిచేస్తున్న తీరు ఈ నూతన కేంద్రం యొక్క ప్రారంభోత్సవాన్ని త్వరితగతిన పూర్తి చేసుకునేలా చేసింది. గోదావరి అట్లాంటా కోసం నన్ను ఎంపిక చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అని గోదావరి అట్లాంటా యజమాని ప్రతివింద్‌ తెలిపారు. ‘బ్రాండ్‌ గోదావరిని ముందుకు తీసుకుపోతూ.... ప్రత్యేకమైన బృందాన్ని నడిపిస్తూ కౌశింక్‌ కోగంటి మరియు తేజా చేకూరిల పనితీరును నన్ను ఆశ్చర్య భరితం చేసింది’ అని ఆయన అన్నారు.
 
టాలీవుడ్‌ సెలబ్రిటీలతో రెడ్‌ కార్పెట్‌ లంచ్‌ ఏర్పాటు కార్యక్రమం ఏర్పాటు ద్వారా గ్రాండ్‌ గాలా ఓపెనింగ్‌ కార్యక్రమానికి గోదావరి అట్లాంటా ఎదురుచూస్తోంది.
 
రెండు వారాల క్రితం ప్రారంభమైన గోదావరి కాన్జాస్‌ ‘ఇండియన్‌ రెస్టారెంట్ల బాహుబలి’గా తన ప్రత్యేకతను నిలుపుకొంది. రెస్టారెంట్‌ ప్రారంభమైన మొదటి నుంచి దాదాపుగా గంటపాటు వేచి ఉండి ఆహారాన్ని స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ ఆదరణ మాకు అమెరికా రాష్ట్రాల్లో గోదావరి ప్రవాహం సాగుతున్న అనుభూతిని తలపిస్తోంది అని తేజా చేకూరి వివరించారు.
 
ప్రతి కొత్త కేంద్రం విస్తరణ, విజయవంతం అవుతున్న తీరుతో తమపై బాధ్యతలు మరింతగా పెరుగుతున్నాయని టీం గోదావరి ప్రతినిధులు వివరించారు. ‘మరింత పెద్ద సమూహాలకు చేరువ అవుతుండటం, నూతన భౌగోళిక ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో పాటుగా దక్షిణభారతీయ ప్రామాణిక రుచులను ప్రపంచవ్యాప్తంగా చేరువచేస్తున్నాం’ అని టీం గోదావరి వివరించింది.
 
లొకేషన్‌:
గోదావరి అట్లాంటా చిరునామా
865 ఎన్‌ మెయిన్‌ స్ట్రీట్‌, సూట్‌ #108
ఆల్ఫారెట్టా, జార్జియా 30004
Ph: 678-579-5985
 
సంప్రదించండి
ప్రతివింద్‌
సెల్‌: 731-324-0037
 
మ‌రోమారు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు... మా వంట‌కాల‌ను మీరంతా ఆస్వాదిస్తున్నార‌ని భావిస్తున్నాం…
 
Press note released by:Indian Clicks, LLC
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Garudavega Banner Ad
Pranab said Telangana Movement dies a Natural Death: Mand..
Pranab said Telangana Movement dies a Natural Death: Manda
Mass Shooting in USA: Woman Kills Three, Turns Gun on Her..
Mass Shooting in USA: Woman Kills Three, Turns Gun on Her
AP Media grudge on Pawan Kalyan : Telakapalli Viewpoint..
AP Media grudge on Pawan Kalyan : Telakapalli Viewpoint
Face to Face with Komatireddy Rajgopal Reddy..
Face to Face with Komatireddy Rajgopal Reddy
Special Story: Jagan Vs Vangaveeti in Vijayawada..
Special Story: Jagan Vs Vangaveeti in Vijayawada
CM KCR Strategy: 20 candidates to be Replaced in 105?..
CM KCR Strategy: 20 candidates to be Replaced in 105?
Kalyan Ram political entry in Telangana as MLA ?..
Kalyan Ram political entry in Telangana as MLA ?
BB2: Kaushal wife Thanks Supporters on Daughter's Birthda..
BB2: Kaushal wife Thanks Supporters on Daughter's Birthday
Hamara Prasad Sensational Counter to Kathi Mahesh..
Hamara Prasad Sensational Counter to Kathi Mahesh
I Feel to Protect Nani: Nagarjuna @ Devadas Music Party..
I Feel to Protect Nani: Nagarjuna @ Devadas Music Party
Tongue will be Cut : CI warns JC Diwakar Reddy..
Tongue will be Cut : CI warns JC Diwakar Reddy
Kunthia Committees rupture Telangana Congress..
Kunthia Committees rupture Telangana Congress
Cong. not to name CM candidate in Telangana..
Cong. not to name CM candidate in Telangana
Rashmika Crazy Dance @ Devadas Audio Launch..
Rashmika Crazy Dance @ Devadas Audio Launch
Suma stokes Fun over BB Trolls on Nani @ Devadas Event..
Suma stokes Fun over BB Trolls on Nani @ Devadas Event
Uttam Kumar Reddy vs Revanth Reddy in T- Congress..
Uttam Kumar Reddy vs Revanth Reddy in T- Congress
Otter Animals Attract Everyone at Srisailam Dam..
Otter Animals Attract Everyone at Srisailam Dam
DevaDas Audio Launch - LIVE..
DevaDas Audio Launch - LIVE
Broker Committees: Komatireddy fires on Cong Kuntiya..
Broker Committees: Komatireddy fires on Cong Kuntiya
Sandeep, family members face-to-face; Brutal father..
Sandeep, family members face-to-face; Brutal father