navy: 11 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడిన శునకం!

  • సెంట్రల్‌ మెక్సికోలో భూకంప శిథిలాల తొలగింపు ప్రక్రియ
  • మెక్సికన్‌ నేవీకి చెందిన జాగిలం ‘ఫ్రిదా’ కీలక పాత్ర  
  • ఇప్పటివరకు మొత్తం 52 మందిని రక్షించిన జాగిలం

సెంట్రల్‌ మెక్సికోను రెండు భారీ భూకంపాలు కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ ప్ర‌కృతి వైపరీత్యానికి వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అక్క‌డ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు. మెక్సికన్‌ నేవీకి చెందిన శున‌కం ‘ఫ్రిదా’ కూడా సాయం చేస్తూ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. సిబ్బంది కూడా కనుగొనలేని విధంగా శిథిలాల కింద చిక్కుకున్న వారిని ఇది గుర్తిస్తోంది.

నేవీ సిబ్బంది సహాయకచర్య‌ల్లో పాల్గొంటుండ‌గా, వారితో పాటు 15 జాగిలాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏడేళ్ల ఫ్రిదా అనే జాగిలం మాత్రం చురుకుగా ప‌నిచేసింది. ఎన్రిక్‌ రెబ్సామెన్‌ స్కూల్‌ వద్ద శిథిలాల కింద చిక్కుకున్న 11 మంది చిన్నారులను గుర్తించి కాపాడింది. ఈ జాగిలానికి ఓ రికార్డు కూడా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ఇది జాతీయ, అంతర్జాతీయ విపత్తుల్లో స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొని 52 మందిని రక్షించింది. సోష‌ల్ మీడియాలో ఈ శునకం ఇప్పుడు హీరో అయిపోయింది. 

More Telugu News