sumanth ashwin: నిహారిక హీరోయిన్ గా 'హ్యాపీ వెడ్డింగ్'

  •  తెలుగులో నిహారిక రెండవ సినిమా
  •  ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో హీరో సుమంత్ అశ్విన్
  •  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణ
  •  అక్టోబర్ 4 నుంచి రెగ్యులర్ షూటింగ్

నాగబాబు కూతురు నిహారిక 'ఒక మనసు' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తరువాత తెలుగులో మంచి కథల కోసం వెయిట్ చేస్తూ, తమిళంలో ఓ సినిమా చేస్తోంది. తాజాగా ఆమె ఓ తెలుగు సినిమాను అంగీకరించినట్టు సమాచారం. యూవీ క్రియేషన్స్ వారు లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేశారు. ఈ సినిమాలో కథానాయకుడిగా సుమంత్ అశ్విన్ ను .. కథానాయికగా నిహారికను ఎంపిక చేసుకున్నారు.

 అక్టోబర్ 4వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నారు. 'హ్యాపీ వెడ్డింగ్' అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. నిహారిక తొలి తెలుగు చిత్రం హిట్ కాకపోయినా ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ఆమె హిట్ కొడుతుందేమో చూడాలి. పెద్ద బ్యానర్ .. దేవిశ్రీ సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తాయని చెప్పొచ్చు.    

More Telugu News