rajamouli: మోదీజీ నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్: రాజమౌళి

  • 'స్వచ్ఛ హీ సేవా'లో భాగం కండి
  • మీవంటి వారు ముందుడుగు వేస్తే మంచిది
  • మిమ్మల్ని ఎంతో మంది అనుసరిస్తారు
  • రాజమౌళికి రాసిన లేఖలో నరేంద్ర మోదీ

స్వచ్ఛ భారత్ లో భాగంగా కేంద్రం ప్రారంభించిన 'స్వచ్ఛ హీ సేవా' కార్యక్రమంలో భాగం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా దర్శకుడు రాజమౌళికి ఓ లేఖను రాయగా, రాజమౌళి దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేయాలని భావించి, ఆహ్వానం పంపినందుకు కృతజ్ఞతలు చెప్పారు. కాగా, మోదీ తన లేఖలో త్వరలోనే గాంధీ జయంతిని జరుపుకోనున్నామని గుర్తు చేస్తూ, దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.

 "వినోద రంగంలో ఎంతో గుర్తింపును తెచ్చుకున్న మీవంటి వారు ముందడుగు వేస్తే ఎంతో మంది వెనుక నడుస్తారు. సామాజికాభివృద్ధికి ఇది ఎంతో కీలకం. నేను మిమ్మల్ని స్వచ్ఛ హీ సేవలో భాగం కావాలని స్వయంగా ఆహ్వానిస్తున్నాను. మీ అనుభవాన్ని ఎప్పుడైనా నాతో పంచుకోవచ్చు. గాంధీ జయంతి నాటికి ఈ కార్యక్రమాన్ని 125 కోట్ల ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. మీ సహకారాన్ని కోరుతున్నాను" అని తన లేఖలో నరేంద్ర మోదీ రాశారు.

More Telugu News