kanche ilayya: ఆర్య వైశ్యుల తీరుతో వాకింగ్ మానేశాను... ద్రవిడ డాన్స్ చేస్తున్నాను: కంచె ఐలయ్య

  • ఆర్యవైశ్యుల ఆందోళనలపై స్పందించిన కంచె ఐలయ్య
  • ఆర్యులు ఇక్కడి వారు కాదు
  • ద్రవిడులే ఇక్కడి వారు
  • ఆర్యులు ద్రవిడ సంస్కృతిని నాశనం చేశారు
  • హరప్పా సంస్కృతి ద్రవిడులది
  • ద్రవిడులు డప్పుకొట్టి డాన్స్ చేసేవారు

ఆర్యవైశ్యుల తీరుతో వాకింగ్ మానేశానని కంచె ఐలయ్య తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వాకింగ్ మానేసి ద్రవిడ డాన్స్ చేస్తున్నానన్నారు. ఆర్యులు విదేశాల నుంచి వచ్చారని ఆయన తెలిపారు. వారి కులం పేరులోనే ఆర్యం (ఆర్య వైశ్యులు) ఉందని ఆయన అన్నారు. తాము హరప్పా నాగరికత నాటి ద్రవిడులమని ఆయన చెప్పారు. రాజ్యాంగాన్ని సవరణలు చేసినట్టే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతను బ్రాహ్మణులు తమకు నచ్చినట్టు రాసుకున్నారని ఈ మధ్యే పేపర్లో వచ్చిందని ఆయన తెలిపారు. తాను రాసిన పుసక్తం మీద చర్చకు సిద్ధమని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

 తనపై చర్యలు తీసుకుంటానన్న నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, ముందు నాయిని వేదాలలో ఏమున్నాయో తెలుసుకోవాలని సూచించారు. ఆ తరువాత ఇలాంటి విషయాలపై ప్రకటన చేయాలని అన్నారు. తనను జైల్లో వేస్తే ఆర్యులు నాశనం చేసిన హరప్పా నాగరికతపై పుస్తకం రాస్తానని ఆయన చెప్పారు. గొప్ప గొప్ప వాళ్లు జైలులో పుస్తకాలు రాశారని ఆయన చెప్పారు. గొల్లవాడైన శ్రీ కృష్ణుడు కూడా జైల్లోనే పుట్టాడని ఆయన గుర్తు చేశారు. తాను రాసిన పుస్తకంపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అర్థవంతమైన చర్చ జరిగితే సమస్య ఉండదని అన్నారు. 

More Telugu News