tamilnadu: దినకరన్ బోటుకి చిల్లు... పళని గూటికి చేరిన ఎంపీ వాసంతి

  • తమిళ రాజకీయాల్లో ఆసక్తికర మలుపు
  • టీటీవీ దినకరన్ కు షాక్
  • రిసార్ట్ నేతల్లో ఎంపీ వాసంతి జంప్
  • పళని వర్గంలో చేరుతున్నట్టు ప్రకటన
  • జంపింగ్ షురూ అంటున్న పళని వర్గం నేతలు

తమిళనాడు రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. తన చేతిలో 83 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ప్రగల్భాలు పలికిన అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ వెంట రిసార్టులకు కేవలం 20 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. అయితే, ప్రభుత్వంలో స్లీపర్ సెల్స్ ఉన్నారని, సరైన సమయంలో వారు బయటకు వస్తారని ఆయన హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. ఈ నేపధ్యంలో పార్టీ నుంచి శశికళతో పాటు ఆయన కూడా బహిష్కరణకు గురికావడం, ఆయనతో పాటు వెళ్లిన వారందరిపైనా అనర్హత వేటు వేయడం, దీనిపై దినకరన్ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణ అక్టోబర్ 4కి వాయిదా పడడం విదితమే.

ఈ నేపథ్యంలో... ఆయన వెంట వెళ్లిన నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు మొదలుకానున్నాయన్న వార్తలు వెలువడ్డాయి. దీంతో తలనొప్పి ఎందుకు అనుకున్నారో ఏమో కానీ దినకరన్ వెంట నడిచిన ఎంపీ వాసంతి ఆయనను విడిచిపెట్టారు. తాను పళనిస్వామి వర్గంలో చేరినట్టుగా ఆమె ప్రకటించారు. దీంతో దినకరన్ వర్గం నుంచి వలసలు మొదలవుతాయని అంచనాలు మొదలయ్యాయి. అక్టోబర్ 4 నాటికి దినకరన్ వర్గం ఖాళీ అవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 

More Telugu News