mehreen: మెహ్రీన్ గ్లామర్ ను మెచ్చేసుకున్న కాజల్!

  •  వరుస సినిమాలతో ఆడియన్స్ ముందుకు రానున్న మెహ్రీన్
  •  ఆమెలో కాజల్ పోలికలు వున్నాయంటూ చెప్పిన అభిమాని 
  •  తనకంటే కాజల్ అందమైనదన్న మెహ్రీన్
  •  ఆమె గ్లామర్ కి కితాబునిచ్చిన కాజల్   

తెలుగు తెరపై తన హవాను మొదలుపెట్టడానికి మెహ్రీన్ సిద్ధమవుతోంది. ఆమె నటించిన 'మహానుభావుడు' .. 'రాజా ది గ్రేట్' .. 'జవాన్' వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాలు హిట్ కొడితే తెలుగులో ఆమె కెరియర్ స్పీడ్ అందుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 ఇక అసలు విషయానికొస్తే, కొన్ని యాంగిల్స్ లో మెహ్రీన్ ను చూస్తే కాజల్ పోలికలు కనిపిస్తుంటాయి. అదే విషయాన్ని ఓ అభిమాని ట్విట్టర్ ద్వారా మెహ్రీన్ తో చెప్పాడు. దాంతో కాజల్ తనకంటే చాలా అందమైనదనీ .. ఆల్రెడీ ఆమె చాలా పాప్యులర్ అనీ అంటూ కాజల్ గురించి మెచ్చుకోలుగా మాట్లాడింది. ఈ విషయంపై కాజల్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించింది. మెహ్రీన్ చాలా అందంగా ఉంటుందంటూ కితాబునిచ్చేసింది. స్టార్ హీరోయిన్ అలా తన గ్లామర్ ను గురించి మెచ్చుకుంటూ మాట్లాడటంతో, సంతోషంతో మురిసిపోవడం మెహ్రీన్ వంతైంది.  

More Telugu News