virat kohli: మోదీపై ప్రశంసలు కురిపించిన విరాట్ కోహ్లీ

  • క్రీడలకు పెద్ద పీట వేస్తున్న కేంద్రం
  • ఖేలో ఇండియా పేరుతో భారీ కార్యక్రమం
  • ఒకే తాటిపైకి మూడు కార్యక్రమాలు
  • క్రీడా హబ్ లుగా 20 యూనివర్శిటీలు

క్రీడలను మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. 'ఖేలో ఇండియా' పేరుతో కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని బుధవారంనాడు ప్రారంభించారు. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని క్రీడలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగు పరచడం కోసం ప్రారంభించారు. ఇప్పుడు దీని పరిధిని మరింత పెంచారు.

క్రీడలకు సంబంధించి ఆల్ రౌండ్ అభివృద్ధిని సాధించే దిశగా ఈ కార్యక్రమాన్ని మెరుగు పరిచారు. గతంలో ఉన్న రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్, అర్బన్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్, నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రామ్ లను ఒకే తాటిపైకి తెచ్చారు. ఇందులో భాగంగా మూడేళ్ల కాలానికి గాను రూ. 1,756 కోట్ల బడ్జెట ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అలాగే, దేశంలోని 20 విశ్వవిద్యాలయాలను క్రీడా హబ్ లుగా మార్చనున్నారు.

క్రీడల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభినందించాడు. ఖేలో ఇండియా కార్యక్రమం అద్భుతమైనదని, మన క్రీడా రంగానికి ఎంతో దోహదపడుతుందని ట్వీట్ చేశాడు. క్రీడల అభివృద్ధికి పాటుపడుతున్న ప్రధాని మోదీ, క్రీడల మంత్రి రాథోడ్ లకు అభినందనలు తెలిపాడు. 

More Telugu News