'సైరా' ఆలస్యం కావడానికి కారణాలు ఇవే!

22-09-2017 Fri 09:44
  •  'రంగస్థలం' షూటింగ్ పూర్తి చేయనున్న చరణ్
  •  ఆ తరువాతనే 'సైరా'పై పూర్తి స్థాయి పర్యవేక్షణ
  •  'సైరా' కోసం భారీ సెట్స్ నిర్మాణం కొనసాగుతోంది 
  • ముఖ్యమైన పాత్రలను చేసే నటీనటులు ప్రస్తుతం బిజీగా వున్నారు    
చిరంజీవి తదుపరి చిత్రమైన 'సైరా నరసింహా రెడ్డి' సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమవుతోందట. ప్రస్తుతం చరణ్ 'రంగస్థలం 1985' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో తన పాత్రకి సంబంధించిన వర్క్ ను పూర్తి చేసి, ఆ తరువాత 'సైరా' నిర్మాణం పనులపై పూర్తి దృష్టి పెట్టే ఆలోచనలో వున్నాడు.

'సైరా' కోసం హైదరాబాద్ .. జైపూర్ లలో భారీ సెట్స్ నిర్మాణం జరుగుతోంది. వాటి నిర్మాణం పూర్తి కావడానికి కొంత సమయం పట్టనుంది. ఇక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించనున్న నయనతార .. అమితాబ్ .. జగపతి .. విజయ్ సేతుపతి .. సుదీప్ ఇలా అంతా కూడా వేరే ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. అవి పూర్తి చేసుకుని వాళ్లు రావడానికి సమయం పడుతుంది. మొత్తం మీద అక్టోబర్ చివర్లో తప్పకుండా సెట్స్ పైకి వెళ్లాలనే ఆలోచనలో వున్నారు.