chandrababu: ఇదిగో... 'ఇగో' చూపించొద్దు... !: మంత్రులు అధికారులకు చంద్రబాబు క్లాస్

  • నిధులిస్తున్నా ఫలితాలు నిల్
  • విద్యాశాఖ పనితీరు అసంతృప్తికరం
  • బయో మెట్రిక్ అమలులో తాత్సారమేల?
  • ఇగో పక్కనబెట్టి పని చేయండి: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో వైద్య, విద్యా రంగాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అధిక నిధులు కేటాయిస్తున్నా, అనుకున్న విధంగా ఫలితాలను రాబట్టడంలో విఫలమవుతున్నారంటూ మంత్రులు, అధికారులపై సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం అధ్యక్షతన వైద్య‌ం, ఆరోగ్యం,  సంక్షేమం, విద్య, పట్టణాభివృద్ధి, పురపాలన, టెక్నికల్ స్కిల్స్ అంశాలపై చర్చ జరుగగా, విద్యాశాఖ అధికారుల వైఖరిపై చంద్రబాబు మండిపడ్డారు. బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేయడంలో తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు.

అహంభావాన్ని వీడి సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ సమయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా, ఆయన్ను అడ్డుకున్న చంద్రబాబు, ఎన్ని మార్లు చెప్పినా విద్యా శాఖ సరిగ్గా పని చేయడం లేదని అన్నారు. లంచాలు తీసుకుంటున్న అధికారుల బాగోతాలు బయటపడుతున్నా, చర్యలు చేపట్టడం లేదని వ్యాఖ్యానించిన చంద్రబాబు, లంచగొండులపై నిర్మొహమాటంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్లు సైతం తమ అహంకారాన్ని, ఇగోలను పక్కనబెట్టి, అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేయాలని అన్నారు.

More Telugu News