pink lake: గులాబి రంగులోకి మారిన చైనా మృతసముద్రం!

  • చైనాలోని షాంఘ్సి ప్రావిన్స్ లో ఉన్న యెన్‌ చెంగ్ సాల్ట్ సరస్సు
  • పింక్ కలర్ లోకి మారిపోయిన సరస్సు
  • డ్యునలీల్లా సెలీనా శైవలాల కారణంగా కలర్ మారిందట 
  • 50 మిలియన్ల సంవత్సరాల క్రిందట రెండు రంగుల్లో కనిపించింది
  • ఈ సముద్రంలో విహరించే అవకాశం కూడా ఉంది
  • చైనా టూరిజానికి భారీ ఆదాయం

సోడియం సల్ఫేట్ తో నిండి ఉన్న చైనా మృత సముద్రం యెన్‌ చెంగ్ సాల్ట్ సరస్సు పింక్ రంగులోకి మారిపోయింది. షాంఘ్సి ప్రావిన్స్ లో ఉన్న ఈ సముద్రంలో డ్యునలీల్లా సెలీనా శైవలాలు (నీటిపై కట్టే పాచి) ఉన్నాయి. వీటి కారణంగా ఇది ఒక సీజన్ లో పింక్ కలర్ లోకి మారిపోతుంది. ప్రపంచంలోని సోడియం సల్ఫేట్ అధికంగా గల సరస్సుల్లో ఇది మూడోది. ఈ సరస్సుకు ఘనమైన చరిత్ర ఉందని చైనా జియాలజిస్టులు చెబుతున్నారు.

 ఈ సముద్రం సుమారు 50 మిలియన్ల సంవత్సరాల కిందట రెండు రంగులలో కనిపించిందని చెబుతున్నారు. ఈ సముద్రంలో కొంత భాగం పింక్ గా, మరికొంత భాగం నీలిరంగులో కనువిందు చేసి ఆకట్టుకుంటుంది. ఈ సమయంలో ఈ సముద్రంలో విహరించే అవకాశం కూడా ఉండడం విశేషం. దీని ద్వారా చైనా ప్రభుత్వానికి భారీ ఆదాయం కూడా సమకూరుతుందని తెలుస్తోంది. ఈ సముద్రం నుంచి వచ్చే ఉప్పును స్ధానిక పారిశ్రామిక అవసరాలకు వినియోగించడం విశేషం. 4 వేల ఏళ్ల క్రిందటి నుంచి ఈ సముద్రాన్ని చైనీయులు ఉపయోగించుకుంటుండడం విశేషం. 

More Telugu News