Pakistan: కశ్మీర్ అంశంపై ఐరాసలో పాక్ పిచ్చి ప్రేలాపనలు.. మితిమీరి వ్యాఖ్యలు

  • కశ్మీర్‌కు ప్రత్యేక రాయబారిని నియమించాలని వేడుకోలు
  • కశ్మీర్ ప్రజలను భారత్ దారుణంగా అణచివేస్తోందని వ్యాఖ్య
  • తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరిక

కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ మరోమారు ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తింది. భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. గురువారం ఐరాస జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధాని షాహిద్ ఖాకన్ అబ్బాసీ మాట్లాడుతూ.. కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవాలని, కశ్మీర్‌కు ప్రత్యేక రాయబారిని నియమించాలని ఐక్యరాజ్య సమితిని కోరారు. కశ్మీర్ ప్రజలను భారత్ దారుణంగా అణచివేస్తోందని ఆరోపించారు. తమకు వ్యతిరేకంగా భారత్ ఉగ్రవాద కార్యకలాపాలు చేపడుతోందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. తమ సిద్ధాంతాలకు భంగం వాటిల్లితే భారత్‌కు ‘తగిన రీతిలో’ బుద్ధి చెబుతామని అబ్బాసీ హెచ్చరించారు.

కశ్మీర్ అంశాన్ని న్యాయంగా, శాంతియుతంగా, వేగవంతంగా పరిష్కరించుకోవాల్సి ఉందని పాక్ ప్రధాని అన్నారు. అయితే భారత్ మాత్రం పాకిస్థాన్‌తో శాంతియుతంగా కలిసి వెళ్లేందుకు సుముఖంగా లేదన్నారు. తమ ప్రతిపాదనలకు ఐరాస భద్రతా మండలి స్పందించి నెరవేర్చాలని కోరారు. జమ్ముకశ్మీర్ విషయంలో ఐరాస ప్రతిపాదనలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News