Actors: రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న తమిళ యువహీరోలు జై, ప్రేమ్‌జీ

తమిళ యువ నటులు జై, ప్రేమ్‌జీలు రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. చెన్నైలో వారు ప్రయాణిస్తున్న 'ఆడి' కారు  అడయార్ బ్రిడ్జిని ఢీకొట్టింది. ఆ సమయంలో కారును జై డ్రైవ్ చేస్తున్నాడు. బ్రిడ్జి గోడను ఢీకొట్టిన కారు కొంతదూరం ప్రయాణించి ఆగిపోయింది. ఈ ప్రమాదం నుంచి నటులు ఇద్దరు ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు.

ఘటనా స్థలానికి చేరుకున్న శాస్త్రినగర్ పోలీసులు 'జై'  తాగి కారును నడిపినట్టు గుర్తించారు. అయితే ఈ ఆరోపణలను ప్రేమ్‌జీ కొట్టిపడేశాడు. అది చాలా చిన్న ప్రమాదమని, తాను, జై క్షేమంగానే ఉన్నట్టు తెలిపాడు. జై నటించిన ‘బెలూన్’ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాకు శైనిష్ దర్శకత్వం వహించాడు.

More Telugu News