durga puja: దుర్గ పూజ సంద‌ర్భంగా కిలోమీట‌ర్ మేర రంగ‌వ‌ల్లులు!

మ‌హాల‌య అమావాస్య సంద‌ర్భంగా తొమ్మిది రోజుల పాటు జ‌రిగే దుర్గ పూజ‌ల‌కు కోల్‌క‌తా అంగ‌రంగ వైభ‌వంగా సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్భంగా ద‌క్షిణ కోల్‌క‌తాలోని లేక్ రోడ్‌లో 400 మంది క‌లిసి రోడ్డంతా ముగ్గుల‌తో నింపేశారు. `ఆల్ప‌న‌` అని పిలిచే ఈ బెంగాలీ శైలి రంగ‌వ‌ల్లులు అంద‌ర్నీ ఆక‌ర్షిస్తున్నాయి.

బెంగాలీ న‌టులు స‌వ్య‌సాచి చ‌క్ర‌వ‌ర్తి, ప్ర‌సేన్‌జీత్ ఛ‌ట‌ర్జీలు కూడా రోడ్డు మీద ఆల్ప‌న వేశారు. దుర్గ పూజ‌ల కోసం ఇక్క‌డికి వ‌చ్చిన భ‌క్తులంద‌రూ ఈ ముగ్గుల‌ను చూసి మైమ‌రచిపోతున్నారు. ఈ రోడ్డు మీద ఫొటోలు, వీడియోలు తీసుకుని త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో పోస్ట్ చేస్తున్నారు.

More Telugu News