mobile: ఆగ‌స్టులో 6.41 మిలియన్లు త‌గ్గిన మొబైల్ స‌బ్‌స్క్రైబ‌ర్లు... స‌ర్వేలో వెల్ల‌డి

  • ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియాల‌కు త‌గ్గిన వినియోగ‌దారులు
  • అయిన‌ప్ప‌టికీ మొద‌టిస్థానంలో ఉన్న ఎయిర్‌టెల్‌
  • తూర్పు యూపీలో ఎక్కువ మంది స‌బ్‌స్క్రెబ‌ర్లు

ఆగ‌స్టు 2017 నెలాఖ‌రు వ‌ర‌కు దేశంలో మొబైల్ స‌బ్‌స్క్రైబ‌ర్ల వివ‌రాల‌ను సెల్యూలార్ ఆప‌రేట‌ర్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం అన్ని నెట్‌వ‌ర్క్‌ల‌కు క‌లిపి 948.54 మిలియ‌న్ల స‌బ్‌స్క్రెబ‌ర్లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. జులై రిపోర్ట్‌తో పోల్చితే 6.41 మిలియ‌న్ల మంది వినియోగ‌దారులు త‌గ్గిపోయారు. జులై నెలాఖరుకు 954.95 మిలియ‌న్ల మంది వినియోగ‌దారులు ఉండేవారు. త‌గ్గిపోయిన స‌బ్‌స్క్రెబ‌ర్ల‌లో ఎయిర్‌టెల్ వినియోగ‌దారులు 2,06,251, వొడాఫోన్ వినియోగ‌దారులు 24,04,807, ఐడియా వినియోగ‌దారులు 28, 98,508 మంది ఉన్నారు.

కాగా, మొత్తం వినియోగ‌దారుల్లో 29.3 శాతం స‌బ్‌స్క్రైబ‌ర్ల‌తో ఎయిర్‌టెల్ ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. ఆ త‌ర్వాతి స్థానాల్లో వొడాఫోన్‌, ఐడియాలు నిలిచాయి. ఇక ఎక్కువ స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్న స‌ర్కిల్‌గా తూర్పు యూపీ నిలిచింది. ఇక్క‌డ 84.07 మిలియ‌న్ల మంది వినియోగ‌దారులు ఉన్నారు. మొత్తం 13 స‌ర్కిళ్ల‌లో ఎయిర్‌టెల్ మొద‌టిస్థానంలో ఉండ‌గా వొడాఫోన్ 5 స‌ర్కిళ్ల‌లో, ఐడియా 3 స‌ర్కిళ్ల‌లో ముందంజ‌లో ఉన్నాయి.

More Telugu News