బొత్స స‌త్య‌నారాయ‌ణ: చంద్రబాబు ధనదాహం వల్లే పోలవరం ఆలస్యం: బొత్స స‌త్య‌నారాయ‌ణ

  • ఆ ప్రాజెక్టు పూర్తి చేయాల‌న్న‌ చిత్తశుద్ధి స‌ర్కారుకి లేదు
  • ట్రాన్స్ ట్రాయ్ వ‌ల్లే పోలవరం ఆలస్యం అయిందని చంద్ర‌బాబు సాకులు
  • కాంట్రాక్టర్ తప్పు చేశాడని మూడేళ్ల తర్వాత చెబుతారా?
  • పోలవరం అంచనాలు రూ.300 కోట్లు ఎలా పెరిగాయి?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ విరుచుకుప‌డ్డారు. ఈ రోజు హైద‌రాబాద్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... త‌న‌ ఆర్థిక అవసరాలు, అవినీతి కార్యక్రమాల కోసమే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పోలవరం నిర్మాణాన్ని ఆలస్యం చేస్తున్నార‌ని ఆరోపించారు. పోలవరం నిర్మాణ ప‌నుల‌ను రాష్ట్రానికి ఇవ్వాలని కేంద్ర ప్ర‌భుత్వానికి చెప్పి, ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని బొత్స అన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేయాల‌న్న‌ చిత్తశుద్ధి స‌ర్కారుకి లేదని ఆరోపించారు.

ప‌నులు మొద‌లు పెట్టిన ఇన్నాళ్ల‌కు ట్రాన్స్ ట్రాయ్ పై విమ‌ర్శ‌లు చేస్తూ ఆ కంపెనీ వ‌ల్లే పోలవరం ఆలస్యం అయిందని చంద్ర‌బాబు కొత్త‌ కార‌ణాలు చెబుతున్నార‌ని బొత్స అన్నారు. కాంట్రాక్టర్ తప్పు చేశాడని మూడేళ్ల తర్వాత చెబుతారా? అని ప్ర‌శ్నించారు. చంద్రబాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోస‌మే పోలవరం ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచార‌ని ఆయ‌న అన్నారు. పోలవరం అంచనాలు రూ.300 కోట్లు ఎలా పెరిగాయో చంద్ర‌బాబు చెప్పాల‌ని ఆయ‌న అన్నారు. చంద్రబాబు ధనదాహం వల్లే పోలవరం ఆలస్యమవుతోందని బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆరోపించారు. 

More Telugu News