raviteja: పాటల కోసం కేరళ వెళ్లిన 'రాజా ది గ్రేట్'

  • రాయఘడ్ షెడ్యూల్ ను పూర్తి చేసిన రవితేజ
  •  నెక్స్ట్ షెడ్యూల్ కోసం కేరళకు
  •  అక్కడ ఒకటి రెండు పాటల చిత్రీకరణ
  •  రాశి ఖన్నా ఐటమ్ సాంగ్ ప్రత్యేకం  

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ 'రాజా ది గ్రేట్' సినిమా చేస్తున్నాడు. మెహ్రీన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. రీసెంట్ గా 'రాయఘడ్'లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ ఎపిసోడ్స్ అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందని అంటున్నారు.

తదుపరి షెడ్యూల్ కోసం ఈ సినిమా టీమ్ కేరళ వెళ్లింది. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. నాయకా నాయికల మధ్య  ఒకటి రెండు పాటలను అక్కడ చిత్రీకరించనున్నట్టు సమాచారం. చూపులేని వ్యక్తిగా రవితేజ కనిపించే ఈ సినిమాలో రాధిక .. ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. స్పెషల్ సాంగులో రాశి ఖన్నా మెరవడం విశేషం. అక్టోబర్ 12న ఈ సినిమా విడుదల కానుంది.          

More Telugu News