varun dhawan: తెలుగు హీరోయిన్ కావాలంటున్న బాలీవుడ్ హీరో వ‌రుణ్ ధావ‌న్‌... వీడియో చూడండి

బాలీవుడ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. `నాకు తెలుగు సినిమాలంటే ఇష్టం. మొద‌టిసారి తెలుగు భాష మాట్లాడ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నాను` అంటూ క్యాప్ష‌న్ పెట్టి ఈ వీడియోను షేర్ చేశాడు. ఇందులో త‌న‌కు ఒక తెలుగు హీరోయిన్ కావాల‌ని తెలుగులో చెప్పాడు. ప‌క్క‌నే ఉన్న వ్య‌క్తి స‌హాయంతో వ‌రుణ్ ఈ మాట‌లు చెప్ప‌గానే వెన‌క నుంచి హీరోయిన్లు తాప్సీ, జాక్విలిన్ ఫెర్నాండెజ్‌లు `మేము తెలుగు హీరోయిన్స్‌..` అనుకుంటూ రావ‌డం ఈ వీడియోలో చూడొచ్చు.

వీరు ముగ్గురు క‌లిసి న‌టించిన `జుద్వా 2` సినిమా సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల‌కానుంది. ఈ సినిమా ప్ర‌చారంలో వీరంతా బిజీగా ఉన్నారు. తెలుగులో వ‌చ్చిన `హలో బ్ర‌ద‌ర్‌` సినిమాను గతంలో హిందీలో స‌ల్మాన్ ఖాన్ తో నిర్మించారు. ఇప్పుడు అదే సినిమాను మళ్లీ వ‌రుణ్ ధావ‌న్‌తో రీమేక్ చేశారు.

More Telugu News