salman khan: కొత్త టాలెంట్‌కు వెల్‌క‌మ్ చెబుతున్న స‌ల్మాన్ ఖాన్‌

  • త‌దుప‌రి చిత్రం కోసం కొత్త వారి వేట‌
  • బీయింగ్ ఇన్ ట‌చ్ యాప్ ద్వారా ఆడిష‌న్స్‌
  • ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించిన హీరో

బాలీవుడ్‌కు కొత్త టాలెంట్‌ను ప‌రిచ‌యం చేసే ప‌నిలో ప‌డ్డాడు కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్‌. అందుకే `బీయింగ్ ఇన్ ట‌చ్` యాప్ ద్వారా త‌న నిర్మాణంలో రానున్న త‌దుప‌రి చిత్రం న‌టీన‌టుల కోసం వేట మొద‌లు పెట్టాడు. ఆ యాప్‌లో ఆడిష‌న్ ఆప్ష‌న్‌లో ఔత్సాహిక న‌టీన‌టులు త‌మ వీడియో ప్రొఫైల్ అప్‌లోడ్ చేయాల‌ని ఆయ‌న ట్విట్ట‌ర్ వీడియో ద్వారా వెల్ల‌డించాడు. ఈ ప్రొఫైల్స్ అన్నింటిని బాలీవుడ్‌లో ఉన్న‌ ప్ర‌ముఖ క్యాస్టింగ్ డైరెక్ట‌ర్ ముకేష్ ఛ‌బ్రా ప‌రిశీలించ‌నున్నారు. ఈ విష‌యానికి సంబంధించి స‌ల్మాన్ ఖాన్ త‌న అకౌంట్‌లో వీడియో పోస్ట్ చేశాడు.

More Telugu News