prathiban: 145 డిగ్రీలను సొంతం చేసుకున్న 'ప్రతిభ'న్!

అత‌డి పేరు ప్ర‌తిభ‌న్‌. పేరుకు త‌గ్గ‌ట్టుగానే చ‌దువులో గొప్ప ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచాడు. త‌మిళ‌నాడుకి చెందిన ఈ ప్రొఫెస‌ర్ ఇప్ప‌టివ‌ర‌కు 145 డిగ్రీలు సంపాదించాడు. అది కూడా కేవ‌లం 30 ఏళ్ల‌లోనే. అలాగ‌ని అత‌డేమీ మెరిట్ స్టూడెంట్ కాదు. ఒక‌ప‌క్క ప‌నిచేస్తూనే మ‌రోప‌క్క చ‌దువు కొన‌సాగించేవాడు. మొదటి డిగ్రీ పొందడంలో ఇబ్బందులు పడినప్పటికీ ఆత్మ విశ్వాసం కోల్పోకుండా దాదాపు ఎవ్వరికీ సాధ్యం కాని అత్యున్నత రికార్డును నెలకొల్పారు. మొదటి డిగ్రీ అనంతరం న్యాయశాఖలో ఓ చిన్న ఉద్యోగంలో చేరారు. అలా ఉద్యోగం చేస్తూ దగ్గర్లో ఉన్న విశ్వవిద్యాలయాలు అందిస్తున్న కోర్సులన్నింటినీ పూర్తి చేశాడు.

ఇలా పూర్తి చేస్తూ చేస్తూ ఇప్పటికి మొత్తం 145 డిగ్రీలు సాధించాడు. బ‌దిలీ స‌ర్టిఫికెట్ అవ‌స‌రం లేని విద్యాసంస్థ‌లు అందించే కోర్సుల‌ను ఏక‌కాలంలో చ‌దివి డిగ్రీలు సంపాదించిన‌ట్లు ప్ర‌తిభ‌న్ తెలిపాడు. గత ముప్పై ఏళ్లుగా ఇదేవిధంగా వివిధ పరీక్షలు రాస్తూ డిగ్రీ, డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన‌ట్లు చెప్పాడు. ఆయ‌న ఇప్పటి వరకు సైన్స్‌లో 3, న్యాయ విద్యలో 8, కామర్స్‌ లో 8, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో 8, ఆర్ట్స్‌ లో 10 మాస్టర్‌ డిగ్రీలతో పాటు మరో 12 రీసెర్చ్‌ డీగ్రీలను కూడా పొందాడు. ప్ర‌స్తుతం వివిధ యూనివర్సిటీల్లో పాఠాలు బోధిస్తూ తన విద్యా పిపాస‌ను తీర్చుకుంటున్నాడు. మ‌రో విష‌యం ఏంటంటే... ప్ర‌తిభ‌న్ భార్య కూడా ఇప్పటికి 9 డీగ్రీలు పూర్తి చేసింది.

More Telugu News