balakrishna: బాలయ్య సినిమాలో నటాషా హీరోయిన్ కాదట!

  •  కె.ఎస్. రవికుమార్ తో బాలయ్య
  •  ఆయనతో మూడవసారి నటిస్తోన్న నయనతార
  •  నటాషా కనిపించేది హీరోయిన్ గా  కాదు .. కూతురుగా
  •   సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు

ప్రస్తుతం బాలకృష్ణ తన 102వ సినిమాకి సంబంధించిన షూటింగులో బిజీగా వున్నారు. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో ఈ సినిమా చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో నయనతార .. మలయాళ యువ కథానాయిక నటాషా దోషి నటిస్తున్నారు. నయనతార ఒక కథానాయిక అయితే మరో కథానాయికగా నటాషా దోషి అలరిస్తుందని అంతా అనుకున్నారు.

 కానీ ఈ సినిమాలో నటాషా దోషి హీరోయిన్ కాదుట .. నయనతార కూతురని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్యను నయనతార ప్రేమించినప్పటికీ, మరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందట. అందుకు దారితీసే పరిస్థితులు ఆసక్తికరంగా వుంటాయనే టాక్ వినిపిస్తోంది. ఫిల్మ్ నగర్లో జరుగుతోన్న ఈ ప్రచారంలో వాస్తవమెంతన్నది చూడాలి. బాలకృష్ణ - నయనతార కాంబినేషన్లో రూపొందుతోన్న మూడవ సినిమా కావడంతో, అందరిలోను భారీ అంచనాలు వున్నాయి. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.     

More Telugu News