the great khali: 'ద గ్రేట్ ఖ‌లీ' బ‌యోపిక్‌లో న‌టించ‌నున్న‌ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌?

`ఎంఎస్ ధోనీ` బ‌యోపిక్‌లో ధోనీగా న‌టించి మంచి మార్కులు కొట్టేసిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, త్వ‌ర‌లోనే మ‌రో బ‌యోపిక్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు తెలుస్తోంది. మ‌ల్ల‌యోధుడు ద గ్రేట్ ఖ‌లీ బ‌యోపిక్‌లో ఖ‌లీ పాత్ర‌ను సుశాంత్ చేయ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. పంజాబీ మ‌ల్ల‌యోధుడు ది‌లీప్ సింగ్ రానా అలియాస్ ద గ్రేట్ ఖ‌లీ జీవిత క‌థ‌ను తెర‌కెక్కించడానికి అనుమ‌తి కోసం నిర్మాత‌లు అత‌ని ద‌గ్గ‌రికి వెళ్లార‌ట‌.

దానికి ఖ‌లీ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో అత‌ని పాత్ర పోషించ‌డానికి సుశాంత్‌ను ఎంచుకున్న‌ట్లు స‌మాచారం. ఈ విష‌యంపై సుశాంత్ కూడా సుముఖ‌త వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో పారాలింపిక్ గోల్డ్ మెడ‌లిస్ట్ ముర‌ళీకాంత్ పెట్కార్ బ‌యోపిక్‌లో కూడా సుశాంత్ న‌టిస్తున్నాడ‌ని వార్త‌లు వచ్చాయి. ప్ర‌స్తుతం `చంద‌మామ దూర్ కే`, `డ్రైవ్‌` చిత్రాల్లో సుశాంత్ న‌టిస్తున్నాడు.

More Telugu News