sadavathi lands auction: సదావర్తి భూముల వేలంపాటకు వైసీపీ అడ్డంకి... రూ. 60.30 కోట్లకు వేలం పాడిన వ్యక్తి విత్ డ్రా!

  • వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
  • మంత్రి ఆదినారాయణరెడ్డి పెట్టుబడులు పెట్టారంటూ ప్రచారం
  • వైసీపీ వల్లే డబ్బులు చెల్లించలేదు
  • వైసీపీతో మాకు లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది

సుప్రీంకోర్టు ఆదేశాలతో సదావర్తి భూములకు మరోసారి వేలంపాట జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ వేలంపాట వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. వివరాల్లోకి వెళ్తే, కడప జిల్లాకు చెందిన శ్రీనివాసులురెడ్డి రూ. 60.30 కోట్లకు వేలం పాడి సదావర్తి భూములను సొంతం చేసుకున్నారు. అయితే, ఆయన తన వేలంపాటను విత్ డ్రా చేసుకున్నారు. వేలం ధరను చెల్లించాల్సిన సమయం కూడా ముగిసిపోయింది.

ఈ సందర్భంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ, 60.30 కోట్లకు వేలం పాడామని... డబ్బులు చెల్లించేందుకు కూడా సిద్ధమయ్యామని... అయితే, వైసీపీ నేతలు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని... ఈ క్రమంలోనే తాము తప్పుకుంటున్నామని చెప్పారు.  టీడీపీతో తమకు సంబంధాలు ఉన్నాయని... మంత్రి ఆదినారాయణరెడ్డి పెట్టుబడులు పెట్టారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలం ధరను చెల్లించిన తర్వాత కూడా వైసీపీతో తమకు లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని... డబ్బులు చెల్లించిన తర్వాత, భూములను అప్పగించకపోతే తీవ్రంగా నష్టపోతామని అన్నారు. వైసీపీ నేతల ఆరోపణల వల్లే తాము డబ్బులు చెల్లించలేదని స్పష్టం చేశారు.

More Telugu News