SCR: దసరా సీజన్ కోసం హైదరాబాద్ నుంచి విశాఖ, కాకినాడలకు ప్రత్యేక రైళ్లు.. వివరాలు!

  • గుంటూరు, విజయవాడల మీదుగా ప్రత్యేక రైళ్లు
  • ఏసీ, స్లీపర్ బోగీలతో రైలు
  • ప్రయాణికులు వినియోగించుకోవాలని ద.మ.రైల్వే సూచన

ఈ దసరా పండగ సీజన్ లో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, కాకినాడలకు 9 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 07148 నంబరుతో హైదరాబాద్ నుంచి విశాఖకు 28, 30 తేదీల్లో రైలుంటుందని, హైదరాబాద్ లో ఇది సాయంత్రం 6.50కి బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట మీదుగా మరుసటి రోజు ఉదయం 8 గంటలకు విశాఖ చేరుతుందని, తిరిగి 07147 నంబరుతో 29, అక్టోబర్ 1 తేదీల్లో విశాఖ నుంచి రాత్రి 7.20 గంటలకు బయలుదేరి అదే మార్గంలో మరుసటి రోజు ఉదయం 8.50కి చేరుతుందని తెలిపారు.

 ఇక హైదరాబాద్ నుంచి కాకినాడకు 07001 నంబరుతో 27, 29 తేదీల్లో సాయంత్రం 6.50కి బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం, రాజమండ్రి మీదుగా కాకినాడకు మరుసటి రోజు ఉదయం 5.35కు చేరుతుందని, తిరుగు ప్రయాణంలో 07002 నంబరుతో 28, అక్టోబర్ 2 తేదీల్లో సాయంత్రం 5.55కు బయలుదేరి అదే మార్గంలో మరుసటి రోజు 5.10కి చేరుతుందని అధికారులు తెలిపారు. ఈ రైళ్లలో 10 స్లీపర్ బోగీలతో పాటు త్రీ టైర్, టూ టైర్ ఏసీ బోగీలు, జనరల్ బోగీలు ఉంటాయని తెలిపారు.

More Telugu News