rajugari gadi-2: భగవద్గీత శ్లోకంతో మొదలై... ఊరమాస్ దెయ్యంతో ఆడుకున్న నాగ్... 'రాజుగారిగది-2' ట్రయిలర్ చూడండి!

  • మెంటలిస్టుగా కనిపిస్తున్న నాగార్జున
  • చేతిలో రుద్రాక్ష మాలతో దెయ్యం ఎదుటకు
  • ఆత్మ బొమ్మగీస్తే, దానంతట అదే మాయం
  • అక్టోబర్ 13న విడుదలకు సిద్ధం

'ఆత్మను శస్త్రము ఛేదింపజాలదు, అగ్ని దహింపజాలదు... ఆత్మ నాశనము లేనిది' అంటూ భగవద్గీతలోని శ్లోకంతో మొదలు పెడుతూ, 'రాజుగారి గది-2' థియేటరికల్ ట్రయిలర్ విడుదలైంది. ఇందులో నాగార్జున మెంటలిస్టుగా, కళ్లల్లో చూస్తూ గుండెల్లో ఏమున్నదో చెప్పే మానసిక వైద్యుడిగా కనిపిస్తున్నాడు.

ఓ గోడలో నుంచి చెయ్యి వచ్చి మెడ పట్టుకునే దృశ్యాలు, సాధారణ హారర్ సినిమాల్లో కనిపించే భయంకర శబ్దాలు కూడా ఉన్నాయి. ఇక ఈ దెయ్యం మామూలుది కాదని, ఊరమాస్ దెయ్యమని, పిచ్చెక్కించేస్తోందని వెన్నెల కిశోర్ చెప్పటం, చేతిలో రుద్రాక్ష మాలతో నాగార్జున దాన్ని ఆటాడించే ప్రయత్నం చేయడం తెలుస్తోంది.

ఓ అమ్మాయి ఆత్మ పగతో ఉందని, ప్రతీకారం కోరుతోందని నాగ్ చెప్పడం, ఆత్మ ఆకారాన్ని చిత్రిస్తే, దానంతట అదే మాయం కావడం వంటి దృశ్యాలతో ఈ ట్రయిలర్ అలరిస్తోంది. ఇక తొలి భాగంలో ఉన్న ఫేమస్ డైలాగ్ 'బొమ్మాళీ నన్ను పెళ్లిచేసుకుంటావా?' అన్న మాటలు ఇందులోనూ ఉన్నాయి. అక్టోబర్ 13న విడుదలకు సిద్ధమైన చిత్రం ట్రయిలర్ ను మీరూ చూడవచ్చు.

More Telugu News