mahesh babu: తమిళనాట 'స్పైడర్' భారీ రిలీజ్!

  •  అజిత్ .. విజయ్ సినిమాల మాదిరిగానే తమిళంలో 'స్పైడర్' రిలీజ్ పై  ఆసక్తి
  •  తమిళంలో తన మార్కెట్ పెరగడం ఖాయమనే నమ్మకంతో  మహేశ్
  •  రెండు భాషల్లోను హిట్ కొట్టచ్చన్న ఆనందంతో రకుల్

మురుగదాస్ .. మహేశ్ బాబు కాంబినేషన్లో తెలుగు .. తమిళ భాషల్లో 'స్పైడర్' చిత్రం రూపొందింది. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా ఈ రెండు భాషల్లోను విడుదలకానుంది. తెలుగులో భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమా, తమిళంలోను అదే స్థాయిలో విడుదలవుతోంది. తొలిరోజున ఈ సినిమా అక్కడ 450 స్క్రీన్లపై రిలీజ్ అవుతోంది. ఓ అజిత్ .. ఓ విజయ్ సినిమాలపట్ల చూపించే ఆసక్తినే ఈ సినిమా పట్ల అక్కడివారు చూపడం విశేషం.

తమిళంలోను మహేశ్ బాబుకి గల క్రేజ్ .. మురుగదాస్ సినిమాల పట్ల గల నమ్మకం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. తమిళ ప్రేక్షకుల ముందుకు తనని నేరుగా తీసుకెళుతోన్న ఈ సినిమా, అక్కడ తన మార్కెట్ ను మరింతగా పెంచుతుందని మహేశ్ భావిస్తున్నాడు. ఇక తెలుగు .. తమిళ భాషల్లో తన క్రేజ్ ను ఈ సినిమా మరింతగా పెంచుతుందనే నమ్మకంతో రకుల్ వుంది. ఇంతవరకూ ఆమె చేసిన చిత్రాలలో ఇదే అత్యధిక బడ్జెట్ చిత్రం కావడం విశేషం.       

More Telugu News