military helicopter: రాకెట్లను వదిలిన హెలికాప్టర్.. సైనిక వాహనాలు ధ్వంసం!

  • రష్యాలో ఘటన
  • కెప్టెన్ తప్పిదం
  • ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఓ వ్యక్తి

శిక్షణలో ఉన్న ఓ సైనిక హెలికాప్టర్ కెప్టెన్ తీవ్ర తప్పిదం చేశాడు. రష్యాలో ఈ ఘటన చోటు చేసుకుంది. శిక్షణ ప్రాంతంలో కొన్ని మిలటరీ వాహనాలు అప్పటికే పార్క్ చేసి ఉన్నాయి. ఈ సమయంలో వాటికి కొంచెం దూరంలో విన్యాసాలు చేస్తూ అక్కడకు వచ్చిన  సైనిక హెలికాప్టర్ ఒకటి రాకెట్లను వదిలింది. ఇవి వచ్చి మిలిటరీ వాహనాలపై పడ్డాయి. దీంతో, సైనిక వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ సందర్భంగా వాహనాలకు సమీపంలో నడుస్తూ వెళ్తున్న మిలటరీ వ్యక్తిని పెద్ద ఎత్తున దుమ్ము కప్పేసింది. అయితే, ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.  

More Telugu News