mexico: మెక్సికో భూకంపం, 150 దాటిన మృతులు... భయానక భూకంప వీడియోలు!

  • మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం
  • మెక్సికోలో కుప్పకూలిన 40 భవంతులు
  • రంగంలోకి దిగిన అత్యవసర సహాయ బృందాలు
  • సోషల్ మీడియాలో భూకంప వీడియోలు

రెండు వారాల వ్యవధిలో మెక్సికోను రెండో భూకంపం కుదిపేయగా, భారీ ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. ఇప్పటివరకూ మృతుల సంఖ్య 156కు చేరిందని అధికారులు తెలిపారు. ఈ సంఖ్య మరింతగా పెరగవచ్చని అంచనా వేస్తున్న అధికారులు, మెక్సికో నగరంలో ఎక్కడ చూసినా క్షతగాత్రుల హాహాకారాలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. గాయపడిన వారికి అత్యవసర చికిత్స నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.

 నగరంలో కనీసం 40 భవంతులు కుప్పకూలాయని, వాటిల్లో రెండు పాఠశాలలు కూడా ఉన్నాయని వెల్లడించారు. భవంతుల సెల్లార్లలో ఉన్న కార్లు నుజ్జునుజ్జయ్యాయని, అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు. కాగా, మెక్సికో నగరానికి 100 మైళ్ల దూరంలో ప్యూబ్లా వద్ద భూకంప కేంద్రం ఉండగా, మధ్యాహ్నం ఒంటిగంట తరువాత భూకంపం సంభవించింది. వేలాది భవనాలకు బీటలు పడ్డాయి. మెక్సికో నుంచి వస్తున్న వీడియోలు, చిత్రాలు భూకంప తీవ్రతను తెలియజేస్తున్నాయి.

 ఈ భూకంపం కారణంగా బిలియన్ల కొద్దీ ఆస్తి నష్టం సంభవించిందని, మొత్తం ఆస్తినష్టం అంచనాలు అందేందుకు మరింత సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. పలు సీసీ కెమెరాల్లో రికార్డయిన భవంతుల దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భూకంపం ధాటికి ఓ చమురు కేంద్రంలో పెద్ద ఎత్తున పేలుడు, నేలమట్టమవుతున్న బహుళ అంతస్తుల భవంతి దృశ్యాలను మీరూ చూడవచ్చు.

More Telugu News