cyclone: ప్యూర్టారికాలో తీరం దాటిన 'మరియా'... ఏకంగా ప్రధాని ఇంటి పైకప్పు ఎగిరిపోయింది!

  • డొమినికాను బెంబేలెత్తించిన మరియా తుపాను
  • 260 కిలోమీటర్ల వేగంతో గాలులు
  • వర్షం దయచూపితే బయటపడగలనన్న డొమినికా ప్రధాని
  • తీరం దాటినా బలపడే అవకాశం ఉందన్న అమెరికా వాతావరణ శాఖ

అమెరికాను బెంబేలెత్తించిన మరియా తుపాను ప్యూర్టారికాలో తీరం దాటింది. 260 కిలోమీటర్ల వేగంతో డొమినికాపై విరుచుకుపడిన మరియా తుపాను, 250 కిలోమీటర్ల వేగంతో ప్యూర్టారికోను తాకింది. దీని ధాటికి ఇళ్లపైకప్పులు ఎగిరిపోయాయి. డొమినికా ప్రధాని రూజ్ వెల్ట్ స్కెర్రిట్ ఇంటి పైకప్పు కూడా లేచిపోయింది. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు.

వర్షం దయ చూపితేనే తాను అక్కడి నుంచి బయటపడగలనని ప్రధాని పేర్కొన్నారు. దీంతో అక్కడి తుపాను తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించిన అమెరికా ప్యూర్టారికో నుంచి ప్రజలను ఖాళీ చేయించింది. మరియా తీరం దాటినా బలపడే ప్రమాదం ఉందని, అప్పుడే ఇంకా ముప్పు తొలగలేదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ధాటికి ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సమస్య నెలకొంది. మారుమూల ప్రాంతాలను చేరుకోవడం కూడా కష్టంగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, అమెరికాను హార్వే, ఇర్మా, మరియా తుపానులు తాకగా, జోష్ పేరుతో మరో తుపాను దూసుకొస్తోంది. 

More Telugu News