ట్రంప్: ఉత్తరకొరియాను మరోసారి గట్టిగా హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్

  • అవసరమైతే ఉత్త‌ర‌కొరియాను సర్వనాశనం చేస్తాం
  • ఉత్త‌ర‌కొరియా ప్ర‌పంచానికి పెను ముప్పులా మారింది
  • అమెరికాలో నిరుద్యోగ సమస్య త‌గ్గిపోయింది
  • ఉగ్రవాదం, తీవ్రవాదాలను తిప్పికొట్టాలి

ఉత్త‌ర‌కొరియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు గ‌ట్టిగా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ట్రంప్ ప్ర‌సంగిస్తూ.. అవసరమైతే ఉత్త‌ర‌కొరియాను సర్వనాశనం చేస్తామని వ్యాఖ్యానించారు. అణుబాంబులు వేస్తామని బెదిరించడమే ఆ దేశ విధానంగా ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఉత్త‌ర‌కొరియా ప్ర‌పంచానికి పెను ముప్పులా మారింద‌ని అన్నారు. ఆ దేశంలో మానవహక్కుల ఉల్లంఘ‌న కూడా విచ్చ‌ల‌విడిగా జ‌రుగుతోంద‌ని  చెప్పారు.

కాగా, 'మేకింగ్‌ అమెరికా గ్రేట్‌ అగైన్' అనే నినాదంతో తాను అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత త‌మ దేశం మ‌రింత‌ అభివృద్ధి సాధిస్తోంద‌ని ట్రంప్ అన్నారు. త‌మ దేశంలో నిరుద్యోగ సమస్య త‌గ్గిపోయింద‌ని చెప్పారు. అలాగే త‌మ‌ దేశ సైనిక రంగాన్ని మరింత బలోపేతం చేస్తామ‌ని తెలిపారు. ప్రస్తుతం ఉగ్రవాదం, తీవ్రవాదాలు ప్రపంచాన్ని వ‌ణికిస్తున్నాయ‌ని, వాటిని తిప్పికొట్టాలని అన్నారు. అమెరికాలో భిన్న ధృవాల ప్ర‌జ‌లు నివ‌సిస్తున్నార‌ని, త‌మ పద్ధతులను ఎవ‌రిమీదా రుద్దబోమ‌ని అన్నారు.  

More Telugu News