stalin: స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశం.. కీలక నిర్ణయాలు

త‌మిళ‌నాడులో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఆ రాష్ట్ర ప్ర‌తిప‌క్ష డీఎంకే నేత స్టాలిన్ త‌మ ఎమ్మెల్యేల‌తో ఈ రోజు కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ రోజు చెన్నైలో జ‌రిగిన ఈ స‌మావేశంలో పార్టీ నేత‌లు త‌మ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై నిర్ణ‌యాలు తీసుకున్నారు. అలాగే, ప‌లు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌, అసెంబ్లీ స్పీక‌ర్, సీఎంకు వ్య‌తిరేకంగా తీర్మానాలు ఆమోదించినట్లు ఆ పార్టీ ప్ర‌క‌టించింది. వారు రాజ్యాంగ ప‌దవుల‌ను దుర్వినియోగం చేస్తున్నారని మండిప‌డింది. అన్నాడీఎంకే అడ్డ‌దారిలో మెజార్టీ నిరూపించుకోవాల‌ని చూస్తోంద‌ని అన్నారు. సీఎం, స్పీక‌ర్ త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అన్నాడీఎంకేలోని దిన‌క‌ర‌న్ వ‌ర్గం ఎమ్మెల్యేల‌పై స్పీక‌ర్‌ వేటు వేసిన అంశంపై కోర్టు త‌మ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన త‌రువాత త‌మ వ్యూహం ఏంటో ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపింది. 

More Telugu News