వెండితెర‌పై మ‌రో బ‌యోపిక్‌... మ‌హిళా క్రికెట‌ర్ జుల‌న్ గోస్వామి జీవిత‌క‌థ‌తో సినిమా

19-09-2017 Tue 17:47
  • ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న సుశాంత దాస్‌
  • `ఛ‌క్దాహా ఎక్స్‌ప్రెస్‌` పేరు ఖరారు
  • వ‌చ్చే ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభం
ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్క‌ర్ జీవిత క‌థ‌ల త‌ర‌హాలో మ‌హిళా జ‌ట్టు క్రికెట‌ర్ జుల‌న్ గోస్వామి జీవిత క‌థ‌ను సినిమాగా తీయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వ‌న్డేల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన మ‌హిళా క్రికెట‌ర్‌గా జుల‌న్ జీవిత‌గాథ‌ సుశాంత దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాగా రానుంది. `ఛ‌క్దాహా ఎక్స్‌ప్రెస్‌` పేరుతో రానున్న ఈ చిత్రంలో జుల‌న్ చిన్న‌త‌నం నుంచి ప్రారంభ‌మై ఇటీవ‌ల ప్ర‌పంచ క‌ప్‌లో త‌న ప్ర‌ద‌ర్శ‌న వ‌ర‌కు చూపించ‌నున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను 2018, ఏప్రిల్‌లో ప్రారంభించ‌నున్నారు. అయితే జుల‌న్ పాత్ర ఎవ‌రు పోషించ‌నున్నార‌న్న సంగ‌తి మాత్రం ఇంకా తెలియ‌రాలేదు.