sharwanand: ఏ సినిమాతోనూ 'మహానుభావుడు'కి పోలిక లేదు : మారుతి

  •  విడుదలకి ముస్తాబవుతోన్న 'మహానుభావుడు'
  •  మలయాళ మూవీ పోలికలున్నాయంటూ టాక్
  •  అలాంటివేం వుండవంటోన్న మారుతి

శర్వానంద్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో 'మహానుభావుడు' సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఈ నెల 29వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. ఈ సినిమాలో హీరో అతిశుభ్రత అనే వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. అదే విషయాన్ని ట్రైలర్ లో చూపించారు.

 ఇది చూసిన వాళ్లు .. ఈ సినిమాకి మలయాళంలో వచ్చిన 'నార్త్ 24 కాథమ్'తో పోలిక ఉందని చెప్పుకుంటున్నారు. 2013లో ఫాహద్ ఫాజిల్ .. స్వాతి రెడ్డి చేసిన ఈ మలయాళ సినిమా అక్కడ హిట్ చిత్రంగా నిలిచింది. ఆ సినిమాతో 'మహానుభావుడు'ను ముడిపెడుతూ మాట్లాడుకుంటున్నారు. అయితే అతిశుభ్రత అనే కథాంశంతో ఆయా భాషల్లో కొన్ని సినిమాలు వచ్చాయనీ, అంత మాత్రాన వాటి నుంచే 'మహానుభావుడు' వచ్చాడనడం సరికాదనీ, ఏ సినిమాతోను ఈ సినిమాకి పోలిక వుండదని మారుతి  అంటున్నాడు.         

More Telugu News