tree brown: ఆత్మహత్యకు పాల్పడిన అత్యంత విషపూరిత సర్పం!

  • ఆస్ట్రేలియాలో పాము ఆత్మహత్య
  • స్నేక్ హంటర్ సమక్షంలో జరిగిన ఘటన
  • ఆశ్చర్యంతో చూస్తుండిపోయిన స్నేక్ హంటర్
  • ఆస్ట్రేలియాలో అత్యంత విషపూరిత సర్పం ట్రీ బ్రౌన్
  • ఇది కాటేసిన నిమిషాల్లో ఎలాంటి వ్యక్తి అయినా ప్రాణాలు కోల్పోవాల్సిందే

ఆస్ట్రేలియాలో అత్యంత విషపూరితమైన సర్పం ఆత్మహత్యకు పాల్పడడం స్నేక్ హంటర్ ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఆస్ట్రేలియాలో ట్రీ బ్రౌన్ అనే విషసర్పాలు ఉంటాయి. ఇవి కాటు వేస్తే మనుషులు నిమిషాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతారు. ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పాలలో ఈ జాతి ఒకటి. ఆస్ట్రేలియాలోని కేథరిన్ పట్టణంలోని తన నివాసానికి దూరంగా ఉన్న ప్రాంతం నుంచి స్నేక్ హంటర్ మెంట్‌ హెగెన్ కు ఒక మహిళ ఫోన్ చేసి, తన ఇంట్లో 1.5 మీటర్ల పాము ఉందని, సుమారు రెండు గంటల నుంచి అది అక్కడే ఉందని, ఆందోళనగా ఉందని తెలిపింది.

దీంతో ఆయన హుటాహుటీన ఆమె చెప్పిన అడ్రస్ కు వెళ్లాడు. అక్కడ ట్రీ బ్రౌన్ జాతి సర్పం ఉంది. దానిని మెంట్ హెగెన్ పట్టుకున్నాడు. అలా పట్టుకోగానే, ఆ పాము తనంతట తాను తన మెడపై కాటు వేసుకుంది. దీంతో విషం వ్యాపించి అది మరణించింది. సాధారణంగా పాములు ఆత్మహత్య చేసుకోవడం తానెన్నడూ చూడలేదని ఆయన తెలిపాడు. ఈ పాము తన సమక్షంలో ఆత్మహత్యకు పాల్పడడం షాకింగ్ గా ఉందని ఆయన తెలిపారు. 

More Telugu News