ryan international school: నాకు నిద్ర ప‌ట్టడం లేదు.. స్కూల్‌కి వెళ్లాలంటే భ‌యంగా ఉంది: ర్యాన్ స్కూల్‌లో హ‌త్య‌కు గురైన విద్యార్థి స్నేహితుడు

  • నా పుట్టిన రోజు నాడే చ‌నిపోయాడు
  • అత‌ని కోసం చాక్లెట్లు కూడా ఎక్కువ తెచ్చాను
  • చాలా భ‌యంగా ఉంది


ఎప్పుడూ పక్క‌నే కూర్చునే ప్రద్యుమ‌న్‌ హ‌ఠాత్తుగా దారుణ హ‌త్య‌కు గురికావడంతో అత‌ని స్నేహితుడు చాలా భ‌య‌పడుతున్నాడు. రాత్రుళ్లు స‌రిగా నిద్ర‌పోవ‌డం లేద‌ని, ఉన్న‌ట్టుండి భ‌య‌ప‌డుతున్నాడ‌ని స్నేహితుడి తండ్రి చెప్పాడు. ప్ర‌ద్యుమ‌న్ చ‌నిపోయిన రోజు త‌న పుట్టిన రోజ‌ని, అత‌ని కోసం ప్రత్యేకంగా చాక్లెట్లు కూడా తీసుకొచ్చాన‌ని ఆ విద్యార్థి చెప్పాడు.

`నా బ‌ర్త్‌డే రోజు నా ప్రాణ స్నేహితుడు చ‌నిపోవ‌డంతో నేను చాలా ఏడ్చాను. రోజూ నా ప‌క్క‌నే కూర్చునేవాడు. ఇద్ద‌రం క‌లిసే టిఫిన్ బాక్స్ తినేవాళ్లం. వాడికి స్వీట్లు అంటే చాలా ఇష్టం. వాడు హ‌త్య‌కు గురైన నాటి నుంచి త‌ర‌గ‌తి గ‌దిలోకి వెళ్లాలంటే భ‌యంగా ఉంది. ఎక్క‌డ చూసినా వాడే క‌నిపిస్తున్నాడు. నాకు ఆ పాఠ‌శాల‌లో చ‌ద‌వాల‌ని లేదు` అని విద్యార్థి అన్నాడు.

ప్ర‌ద్యుమ‌న్ హ‌త్య‌కు గురైన 10 రోజుల‌కు పాఠ‌శాల‌ను తిరిగి ప్రారంభించారు. ప్ర‌ద్యుమ‌న్ త‌ర‌గ‌తిలో 35 మంది ఉంటే, పునః ప్రారంభించిన మొద‌టి రోజు కేవ‌లం ఐదుగురు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. హ‌త్య జ‌రిగిన గ‌దిని, దాని చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌ను పోలీసులు సీజ్ చేశారు.

More Telugu News