sunny leone: కొత్త లుక్‌లో స‌న్నీ లియోన్‌... అభిమానుల‌ను ఆట ప‌ట్టిస్తున్న బాలీవుడ్ తార‌!

బాలీవుడ్ స్టార్ స‌న్నీ లియోన్ త‌న త‌దుప‌రి చిత్రం `తేరే ఇంతేజార్‌` కోసం స‌రికొత్త గెట‌ప్‌లో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ కొత్త గెటప్‌కు సంబంధించిన కొన్ని ఫొటోల‌ను ఆమె ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ప్రొస్థెటిక్ మేక‌ప్ వేసుకున్న ఫొటోల‌ను ఆమె పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో ముఖం నిండా ప్రొస్థెటిక్ గ‌మ్‌తో స‌న్నీ గుర్తుప‌ట్ట‌లేనట్టుగా ఉంది. `ఇంత‌కుముందు మీరెన్న‌డూ చూడ‌ని అవ‌తారాన్ని నా త‌ర్వాతి సినిమాలో చూడొచ్చు` అని ఆమె పోస్ట్ చేసింది. అయితే ఆమె గెట‌ప్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను తెలియ‌నీయ‌కుండా తన అభిమానుల‌ను ఆట‌ప‌ట్టించింది.

More Telugu News