dharmendra pradhan: దీపావళి నాటికి పెట్రోల్, డీజిల్ ధరలు దిగిరానున్నాయ్!

  • అమెరికా తుపానులే ఇంధన ధరల పెరుగుదలకు కారణం
  • వచ్చే నెలలో ధరలు తగ్గుముఖం పడతాయి
  • రోజువారీ ధరల సమీక్ష పారదర్శకంగా ఉంది
  • ఇంధన ధరలు కూడా జీఎస్టీ పరిధిలోకి వస్తే.. మేలు జరుగుతుంది

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి భారంగా మారిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దేశవాసులకు తీపి కబురు చెప్పారు. దీపావళి నాటికి వీటి ధరలు తగ్గుతాయని ఆయన తెలిపారు.  

రోజువారీ ఇంధన ధరల సమీక్ష చేపట్టినప్పటి నుంచి వీటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంపై విపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్... రోజువారీ ధరల సమీక్ష చాలా పారదర్శకంగా ఉందని చెప్పారు. అమెరికాను వణికించిన హార్వే, ఇర్మా తుపానుల కారణంగా, అంతర్జాతీయంగా రిఫైనరీ ఔట్ పుట్ 13 శాతం పడిపోయిందని... ఈ కారణంగానే ఇంధన ధరలు పెరిగాయని తెలిపారు. ఇంధన ధరలు కూడా జీఎస్టీ పరిధిలోకి వస్తే... ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన చెప్పారు.

More Telugu News