sharwanand: ఆకట్టుకుంటోన్న'మహానుభావుడు' ట్రైలర్!

  • 'మహానుభావుడు' నుంచి ట్రైలర్ రిలీజ్
  •  లవ్ .. కామెడీకే అధిక ప్రాధాన్యత
  •  ఈ నెల 29వ తేదీన విడుదల    
  •  'స్పైడర్'తో పోటీపడుతుండటం పట్ల అందరిలోను ఆశ్చర్యం


శర్వానంద్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో 'మహానుభావుడు' సినిమా తెరకెక్కింది. మెహ్రీన్ నటిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. కామెడీకి ప్రాధాన్యతనిస్తూ, హీరో పాత్ర స్వరూప స్వభావాలకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు.

ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్, యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా వుంది. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 'స్పైడర్' వంటి భారీ సినిమా రిలీజ్ తరువాత రెండవ రోజునే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధపడటం, అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది.          

More Telugu News