maria hurricane: అమెరికాను వణికిస్తున్న 'మరియా'... 209 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు

  • అమెరికాను తాకనున్న అతి భయంకరమైన నాలుగో తుపాను
  • గత 85 ఏళ్లలో అమెరికా కనీవినీ ఎరుగని తుపాను మరియా
  • 72,000 మంది తరలింపు
  • ప్యూర్టారికోను తాకే అవకాశం
  • మరియాకు జతకలవనున్న జోష్
  • బీభత్సాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న అమెరికా
  • హెచ్చరికలు, సూచనలు, సలహాలతో సిబ్బంది బిజీ
  • 5వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ

హార్వే హరికేన్ ధాటి నుంచి తేరుకునేలోపు అమెరికాను ఇర్మా హరికేన్ అతలాకుతలం చేసింది. దీని బీభత్సం నుంచి తేరుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిసున్న అమెరికాను అట్లాంటిక్ సముద్రంలో చోటుచేసుకున్న అతిభయంకరమైన నాలుగో హరికేన్‌ మరియా తాకనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మరింత ప్రమాదకరమైనదని వారు చెబుతున్నారు. ఇది ప్యూర్టారికో సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వారు తెలిపారు. ఇప్పటికే అమెరికాలో 209 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు భయపెడుతున్నాయి. 

గత 85 ఏళ్లలో ఇంత శక్తిమంతమైన తుపాను అమెరికాను తాకలేదని, మరియా ప్రభావం చాలా తీవ్రమైనదని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 72,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నార్త్ కరోలినా, లీవార్డ్ మార్టినిక్, పోర్టారికో, యూఎస్, బ్రిటీష్ వర్జీన్ ఐల్యాండ్స్ ను ఇంచుమించు ఖాళీ చేయించారు. తీర ప్రాంతాల్లో 5వ నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు. దీనికి జోస్ కూడా జత కలిసే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ రెండూ కలిస్తే జరిగే నష్టాన్ని అంచనా వేసేందుకు కూడా వీలుండదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని చెబుతూ, పలు సూచనలతో కూడిన హెచ్చరికలను ఆక్కడి ప్రభుత్వాలు చేస్తున్నాయి. 

More Telugu News