prabhas: 'సాహో'లో పల్లె పిల్లగా .. మోడ్రన్ గాళ్ గా శ్రద్ధా కపూర్!

  •  షూటింగ్ దశలో 'సాహో'
  •  ఆసక్తిని రేకెత్తించే శ్రద్ధా కపూర్ పాత్ర
  •  ఫైట్స్ కోసం ఆమెకి ప్రత్యేక శిక్షణ
  •  ఈ మూవీ తరువాత ఆమె తెలుగులో స్పీడ్ పెంచే ఛాన్స్

ప్రభాస్ తదుపరి చిత్రంగా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో 'సాహో' రూపొందుతోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదని ఆమె చెప్పేసింది కూడా.

 అయితే ఈ సినిమాలో ఆమె పాత్రలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉంటాయట. ఒక షేడ్ లో రాయలసీమకి చెందిన సంప్రదాయబద్ధమైన యువతిగా .. మరో షేడ్ లో ఫైటింగులు గట్రా చేసే మోడ్రన్ అమ్మాయిగా కనిపించనుందట. ఈ కారణంగానే ప్రభాస్ కి శిక్షణ ఇస్తోన్న హాలీవుడ్ స్టంట్ మాస్టర్, శ్రద్ధా కపూర్ కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాడట. ఈ పాత్రలో శ్రద్ధా కపూర్ చాలా కొత్తగా కనిపిస్తుందనీ .. ఈ సినిమాతో తెలుగులో ఆమెకి మరిన్ని ఛాన్సులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. బాలీవుడ్ నటీనటులు ఎక్కువగా కనిపించే ఈ సినిమా, తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో విడుదల కానుంది.   

More Telugu News