sunny leone: సన్నీలియోన్ హోర్డింగుకి 15 మంది పోలీసుల భద్రత!

  • సన్నీలియోన్ కండోమ్ హోర్డింగ్ కు పోలీసు భద్రత
  • సూరత్ లో భారీ హోర్డింగ్ ఏర్పాటు చేసిన కండోమ్ కంపెనీ
  • గర్భాడాన్స్ తో కండోమ్ ను పోల్చిన కంపెనీ
  • హోర్డింగ్ లో పేర్కొన్న కొటేషన్ పై గుజరాతీల ఆగ్రహం

 బాలీవుడ్ సెక్సీ భామ సన్నీలియోన్ ఓ కండోమ్ యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ యాడ్ కు సంబంధించిన పోస్టర్ ను పెద్ద హోర్డింగ్ గా గుజరాత్ లోని సూరత్ లో ఏర్పాటు చేశారు. విజయదశమి సందర్భంగా చేసే గర్భా డాన్సులతో ముడిపెడుతూ ఈ కండోమ్ యాడ్ ను రూపొందించారు.

దీంతో ఇది వివాదాస్పదమైంది. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. సన్నీలియోన్ ఉన్న ఈ ప్రకటన ప్రజల మనోభావాలు దెబ్బతీసేదిగా ఉందని ఆరోపించారు. దీనిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 15 మంది పోలీసులు ఆ కండోమ్ యాడ్ హోర్డింగ్ కు కాపలాకాస్తున్నారు. 

More Telugu News