Pooja: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

  • పూజా హెగ్డే ఇంట్లో BMW కారు 
  • 'స్కెచ్'లో పాటపాడిన విక్రమ్ 
  • ఈ నెల 27న 'ఖాకి' టీజర్ 
  • 'డిటెక్టివ్'గా వస్తున్న విశాల్

 

*  ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సరసన తెలుగు సినిమాలో నటిస్తున్న అందాలభామ పూజా హెగ్డే తన డ్రీమ్ కారును సొంతం చేసుకుంది. తాజాగా BMW సెడాన్ మోడల్ కారును కొనుగోలు చేసింది. అందుకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.  
*  విక్రమ్, తమన్నా జంటగా నటిస్తున్న 'స్కెచ్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విజయచంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో విక్రమ్ ఓ పాట పాడడం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి వచ్చే నెలలో విడుదల చేస్తారు.
*  కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'ఖాకి' చిత్రం టీజర్ ను ఈ నెల 27న విడుదల చేస్తారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్ 17న రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. దీనికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు.    
*  విశాల్ ఇటీవల నటించిన 'తుప్పారివాలన్' చిత్రం తమిళంలో మంచి హిట్ కొట్టింది. తెలుగులోకి దీనిని 'డిటెక్టివ్' పేరిట అనువదిస్తున్నారు. దీనికి మిస్కిన్ దర్శకత్వం వహించాడు.   

More Telugu News