raja the great: `రాజా ది గ్రేట్‌` టైటిల్ సాంగ్ విడుద‌ల‌... వీడియో చూడండి!

ర‌వితేజ అంధుడిగా న‌టిస్తున్న `రాజా ది గ్రేట్‌` టైటిల్ సాంగ్ లిరిక‌ల్ వీడియో విడుద‌లైంది. సాయి కార్తీక్ స్వ‌రాలు స‌మ‌కూర్చిన ఈ పాట‌ను రేవంత్‌, సాకేత్‌ల‌తో క‌లిసి ర‌వితేజ కూడా పాడారు. ఈ పాట‌ను శ్యామ్ కాస‌ర్ల ర‌చించారు. `రాజా... రాజా..రాజా` అంటూ ప్రారంభ‌మైన ఈ పాట‌లో హాస్య‌న‌టుడు శ్రీనివాస్ రెడ్డి కూడా కోర‌స్ పాడుతుండ‌టం ఈ వీడియోలో చూడొచ్చు. సినిమా నిర్మాణ దృశాల్లో ర‌వితేజ కుమారుణ్ని కూడా ఈ వీడియోలో చూపించారు. పాట రికార్డింగ్‌కి సంబంధించిన దృశ్యాల‌ను కూడా ఈ వీడియోలో పొందుప‌రిచారు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న మెహ్రీన్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

More Telugu News