శివసేన: ఓపక్క ధరలు పెరిగిపోతోంటే.. కేంద్రమంత్రులు అలాగేనా మాట్లాడేది?: శివసేన మండిపాటు

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ నినాదమైన అచ్ఛేదిన్‌పై బీజేపీ మిత్రపక్షం శివసేన మండిప‌డింది. స‌రుకులు, పెట్రో ఉత్పత్తుల ధ‌ర‌లు పెరిగిపోతున్నాయ‌ని, త‌మ‌ పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో శివసేన పేర్కొంది. ఓ వైపు పెట్రోల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోతోంటే కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్ ధ‌ర‌ల‌ను సమర్థించుకునే ప్ర‌యత్నం చేస్తున్నార‌ని చెప్పింది. తన జేబు నుంచి తీసి ఖర్చు చేయరు కాబట్టే ఇంధన ధరలు పెరిగినా స‌ద‌రు మంత్రి స‌మ‌ర్థిస్తున్నార‌ని విమర్శించింది. కాంగ్రెస్‌ పాలనలో పెట్రో ధరలను పెంచినప్పుడు రాజ్‌నాథ్‌ సింగ్‌, సుష్మా స్వరాజ్‌తో పాటు బీజేపీ నేతలు ఖాళీ సిలిండర్లతో నిరస‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టార‌ని గుర్తు చేసింది. ఇప్పుడేమో పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గ‌డాన్ని స‌మర్థిస్తున్నార‌ని మండిప‌డింది.  

More Telugu News