sanjay dutt: ద‌క్షిణ భార‌త చిత్ర ప‌రిశ్ర‌మ‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన సంజ‌య్‌ద‌త్‌

  • అజిత్ `వివేగం` చిత్రాన్ని పొగిడిన హీరో
  • న‌మ్మ‌శ‌క్యం కాని రీతిలో సినిమాలు తీస్తున్న ద‌క్షిణ భార‌త ద‌ర్శ‌కులు
  • అన్ని భాష‌ల సినీప‌రిశ్ర‌మ‌లు బాగుండాలి

ఇటీవ‌ల అజిత్ హీరోగా వ‌చ్చిన `వివేగం` చిత్ర ట్రైల‌ర్‌ను చూసిన బాలీవుడ్ నటుడు సంజ‌య్‌ద‌త్ ఆ చిత్రాన్ని, హీరో అజిత్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు. `తెలుగు, త‌మిళ సినీప‌రిశ్ర‌మ‌లు ఇంత మంచి చిత్రాలను ఎలా తీయ‌గలుగుతున్నాయ్? భార‌త చిత్ర‌సీమ అసాధ్యం అనుకున్న సినిమాల‌ను వాళ్లు అవ‌లీల‌గా నిర్మించేస్తున్నారు. అజిత్ `వివేగం` సినిమా ట్రైల‌ర్ చూస్తున్న‌పుడు, ఆ సినిమా ఎలా తెర‌కెక్కించార‌నే విష‌యం నాకు త‌ట్ట‌నే లేదు` అని సంజ‌య్‌ద‌త్ అన్నారు.

అలాగే రాజ‌మౌళి `బాహుబ‌లి` చిత్రాన్ని కూడా ఆయ‌న గుర్తుచేశారు. `అలా చూస్తే `బాహుబ‌లి` చిత్రం కూడా అంచ‌నాల‌కు అంద‌కుండా తెర‌కెక్కించారు. మ‌న‌కు మ‌నం (బాలీవుడ్‌ను ఉద్దేశించి) అతిపెద్ద చిత్ర‌ప‌రిశ్ర‌మ అనుకుంటాం. కానీ ఏదో చిన్న లోపం క‌నిపిస్తోంది. సినిమా ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ ఒక‌రికి ఒక‌రు స‌హాయం చేసుకోవాలి. అప్పుడే మంచి సినిమాలు వ‌స్తాయి` అని సంజ‌య్‌ద‌త్ తెలిపారు.

More Telugu News