usa south korea joint operations: కొరియా ద్వీపకల్పంపై ఎగిరిన అమెరికా యుద్ధ విమానాలు!

  • అమెరికా, ఉత్తర కొరియాల మధ్య పెరుగుతున్న విభేదాలు
  • సంయుక్త విన్యాసాలు చేసిన అమెరికా, కొరియా
  • ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని తెలిపిన ఉత్తర కొరియా

అమెరికా, ఉత్తర కొరియాల మధ్య విభేదాలు నానాటికీ తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తాజాగా, అమెరికాకు చెందిన నాలుగు ఎఫ్-35బి స్టెల్త్ ఫైటర్స్, రెండు బీ-1బీ బాంబర్స్ కొరియా ద్వీపకల్పంపై ఎగిరాయి. అమెరికా-దక్షిణ కొరియా కూటమి సైనిక సత్తాకు, ఉత్తర కొరియా సత్తాకు ఉన్న తేడాను చూపించడానికే ఈ ఫైటర్లను పంపించామని దక్షిణ కొరియా రక్షణ శాఖ తెలిపింది.

సెప్టెంబర్ 3న అణు పరీక్ష, గత శుక్రవారం జపాన్ మీదుగా క్షిపణి పరీక్షను ఉత్తర కొరియా నిర్వహించిన తర్వాత... యూఎస్ విమానాలు ఎగరడం ఇదే తొలిసారి. అమెరికా యుద్ధ విమానాలతో పాటు దక్షిణ కొరియాకు చెందిన ఎఫ్-15కే జెట్ ఫైటర్లు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. ఇలాంటి సంయుక్త విన్యాసాలను ఇలాగే కొనసాగిస్తామని... తద్వారా జాయింట్ ఆపరేషన్ శక్తిని మరింత పెంచుకుంటామని దక్షిణ కొరియా తెలిపింది.

More Telugu News