rohingya muslims: రోహింగ్యా ముస్లింలకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి.. వారి వల్ల దేశ భద్రతకు భంగం: సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

రోహింగ్యా ముస్లింల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. రోహింగ్యాలు చట్ట విరుద్ధంగా భారత్ లో ఉన్నారని అఫిడవిట్ లో పేర్కొంది. వారికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని... ఐసిస్, పాకిస్థాన్ లోని ఉగ్ర సంస్థలతో లింక్స్ ఉన్నాయని తెలిపింది. రోహింగ్యాలను వెనక్కి పంపించాలనేది కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయమని... ఇందులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం సరికాదని చెప్పింది. రోహింగ్యాల తరపున నారిమన్, కపిల్ సిబల్ లు వాదించారు. వారిని శరణార్థులుగా భారత్ లో ఉండనివ్వాలని కోరారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, చట్ట ప్రకారమే కోర్టుకు ముందుకు వెళుతుందని చెప్పారు.  

More Telugu News