nuziveedu iiit: ర్యాగింగ్ చేస్తున్న విద్యార్థులపై నూజివీడు ట్రిపుల్ ఐటీ సంచలన నిర్ణయం!

  • ర్యాగింగ్ కు పాల్పడిన 21 మందిపై వేటు
  • 15 మంది సీనియర్లపై ఏడాది సస్పెన్షన్
  • ఆరుగురు సీనియర్ల శాశ్వత సస్పెన్షన్
  • ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు

కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ సంచలన నిర్ణయం తీసుకుంది. గత వారం రోజులుగా తీవ్ర కలకలం రేపిన ర్యాగింగ్ వ్యవహారంపై ట్రిపుల్ ఐటీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. ట్రిపుల్ ఐటీ ప్రతిష్ఠ, భవిష్యత్ విద్యార్థులకు హెచ్చరికగా మొత్తం 21 మందిపై కఠిన చర్యలు తీసుకుంది. జూనియర్లపై 54 మంది సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడినట్టు గుర్తించారు. వారికి సిబ్బంది కూడా సహకరించినట్టు తెలుస్తోంది.

వీరిలో జూనియర్లపై హింసకు పాల్పడిన 15 మందిని ఏడాదిపాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే వారిని హింసించి, చంపుతామని బెదిరించిన ఆరుగుర్ని శాశ్వతంగా కళాశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు యాజమాన్యం చర్యలపై ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుకునేందుకు కళాశాలలకు రావాలి కానీ, రౌడీయిజానికి, గూండాయిజం నేర్చుకునేందుకు కాదని వారు తెలిపారు. ఈ చర్యలతో కళాశాల ప్రతిష్ఠ మరింత పెరిగిందని వారు అభిప్రాయపడ్డారు. 

More Telugu News